అమెరికాలో కార్చిచ్చు తీవ్ర విషాదం నింపింది. హవాయి దీవులకు స్వర్గధామమైన లహైనా రిసార్టు నగరం బూడిద గుట్టగా మారిపోయింది. మౌయి దీవిలో మృతుల సంఖ్య తాజాగా 89కి చేరింది. ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గత వందేళ్లలో ఈ స్థాయి కార్చిచ్చు చూడలేదని 2,200 నిర్మాణాలు పూర్తిగా కాలిపోయాయన్నారు. ఆస్తి నష్టం సుమారు 6 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని చెప్పారు.