ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దమ్ముంటే తనపై పోటీ చేయాలని పవన్ కళ్యాణ్‌కు విశాఖ ఎంపీ సవాల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 13, 2023, 06:44 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విశాఖపట్నం ఎంపీ, వైఎస్సార్సీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయడానికి తాము సిద్ధమేనన్న ఎంవీవీ.. వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణేనని చంద్రబాబుతో ప్రకటింపజేయాలన్నారు. ‘రాష్ట్రానికి నువ్వు ఏదైనా చేయాలంటే సీఎం కావాలి.. కాబట్టి నీకు మద్దతు ఇచ్చి, ఒకసారి నువ్వు ఏం చేస్తావో చూస్తా’మంటూ విశాఖ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ పర్యటనలో జనసేనాని తనపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇవ్వడం కోసం విశాఖ ఎంపీ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్‌గా చేసుకొని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.


‘విశాఖ ప్రజలు గెలిపిస్తే నేను ఎంపీ అయ్యాను. నేను గెలిచిన నాటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నాను. గాజువాకలో ఓడిన నాటి నుంచి నువ్వు ఏ రోజైనా ప్రజలను కలిశావా..? జనానికి అందుబాటులో ఉన్నావా..? ఏ ఒక్కరితోనైనా నియోజకవర్గ ప్రజలతో మాట్లాడావా..? స్టీట్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఎందుకు ప్రకటన చేయలేకపోతున్నావ్?’ అని ఎంవీవీ ప్రశ్నించారు. ‘విశాఖ వదిలిపోతానని నేనెప్పుడూ చెప్పలేదు. నన్ను ఎంపీగా రాజీనామా చేయమని చెప్పడానికి నువ్వు ఎవడివి..? ఆరు నెలల్లో ఎన్నికలున్నాయి.. దమ్ముంటే గాజువాకలో ఎమ్మెల్యేగా పోటీ చేయి లేదంటే.. నాపై ఎంపీగా పోటీ చేయి’ అని పవన్‌కు విశాఖ ఎంపీ సవాల్ విసిరారు.


‘కరోనా సమయంలోగానీ.. ఇతర సమయాల్లోగానీ నువ్వు ఎవరికీ సాయం చేయలేదు. నీకు ఆంధ్రప్రదేశ్‌లో సొంత ఇల్లు లేదు. నాకు 25 ఏళ్లుగా విశాఖపట్నంలో వ్యాపారాలు చేస్తున్నా. నా మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. విశాఖ అభివృద్ధిలో నా పాత్ర కొంతైనా ఉంది. రాజకీయాల్లో ఉన్న నువ్వు సినిమాలు చేయగా లేనిది నేను వ్యాపారాలు చేస్తే తప్పేంటి..?’ అని జనసేనానిని ఎంవీవీ ప్రశ్నించారు. ‘నాకు ధైర్యం లేదన్నావ్ కదా.. నీకు దమ్ముంటే, నువ్వు మగాడివైతే.. జగన్‌లా సింగిల్‌గా 175 స్థానాల్లో పోటీ చేయి. టీడీపీ మోచేతి నీళ్లు ఎందుకు తాగుతున్నావ్? రాష్ట్రంలో కాపుల ఆత్మగౌరవాన్ని నువ్వు చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టావ్. చంద్రబాబు బూట్లు నాకుతున్నావ్. ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ఏమి చేస్తావో చెప్పు. నీ మేనిఫెస్టో ఏంటో చెప్పు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తావా లేదా..? వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తావా లేదా..?’ అని విశాఖ ఎంపీ పవన్‌ను సూటిగా ప్రశ్నించారు.


‘‘2024లో మేమంతా మద్దతు ఇస్తాం. నువ్వే సీఎం అని చంద్రబాబును ప్రకటించమని చెప్పు. రాష్ట్రానికి నువ్వు ఏదైనా చేయాలంటే నువ్వే సీఎం కావాలి. అందుకే చంద్రబాబును ప్రకటించమని చెప్పు. నీకు మద్దతు ఇచ్చి నువ్వేం చేస్తావో ఒక్కసారి చూస్తాం. నువ్వు సీఎం అవుతావో లేదో తెలీదు.. నీకు ఎన్ని సీట్లు ఇస్తారో తెలీదు.. నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తావ్..? లోకేశ్‌ను సీఎం అయితే నీకేం వస్తుంది..? నువ్వు అనుకున్నది లోకేశ్ చేస్తాడా? 2024లో 175 స్థానాల్లో నువ్వెన్ని స్థానాల్లో పోటీ చేస్తావ్..? టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది..? ఎవరు సీఎంగా ఎంత కాలం ఉంటారో చెప్పండి. నీ అజెండా ఏంటి..? నీ మేనిఫెస్టో ఏంటో చెప్పండి’’ అని జనసేనాని ఎంవీపీ ప్రశ్నించారు.


పవన్ కళ్యాణ్‌కు ఇండివిడ్యువాలిటీ లేదని విశాఖ ఎంపీ ఆరోపించారు. ‘మీ అన్నయ్య పేరు చెప్పుకొని సినిమాల్లోకి వచ్చావ్. భర్తగా ఫెయిల్యూర్. నీకు ఎన్నో పెళ్లిళ్లు, ఎంతో మంది క్యాండిడేట్లు. ఒక ఫాదర్‌గా ఫెయిల్యూర్. నీ కొడుకులకు తండ్రి ఎవడంటే.. లేడు. పార్టీ పెట్టావ్.. పార్టీని కూడా నడిపించలేదు. పోటీ చేసి ఒకే ఒకడిని గెలిపించుకున్నావు. అతడు కూడా పార్టీలో లేడు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయావ్. నీకు ఓటేసిన ప్రజల కష్టాలను ఏనాడూ పట్టించుకోలేదు. నీకు ఓట్లేసిన ఏరియాలో స్టీల్ ప్లాంట్‌ను బీజేపీ ప్రయివేటీకరిస్తే.. ఒక్క మాట కూడా అడగలేదు. మోదీతో, అమిత్ షాతో అంత చనువు ఉంటే.. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను ఆపొచ్చు కద్దా..?’ అని ఎంవీపీ ప్రశ్నించారు.


‘వరహం అనే వెహికల్ కొనుక్కొని దాని మీద సినిమా ఫోజులు ఇచ్చి తిరుగుతున్నావ్. నీ కులాన్ని తాకట్టు పెడుతున్నావ్. నీ కులానికైనా ఏం చేస్తావో చేయగలవని చెప్పగలవా..? సినీ గ్లామర్ లేకపోతే.. అడుక్కోవడానికి కూడా పనికి రావు. నీకంటే కేఏ పాల్ వెయ్యి రెట్లు బెటర్. అతడు అన్ని చోట్లా పోటీ చేస్తున్నాడు. నువ్వు అది కూడా చేయలేకపోతున్నావ్. నేను స్వశక్తితో పైకి వచ్చాను. ఎమ్మెల్యేగా గెలవలేని నువ్వు ఎంపీగా గెలిచిన నా గురించి మాట్లాడతావా? జగన్ కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. 2024లో ఏమీ చేయలేవు. మళ్లీ అడ్రస్ ఉండవు. నీకంటే చెత్త వ్యక్తిగత జీవితం ఎవరికీ ఉండదు’ అని పవన్‌ను ఉద్దేశించి ఎంవీపీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.


‘‘విలువల్లేని వ్యక్తిగత జీవితం నీది. పెళ్లి చేసుకున్నావ్ పెళ్లాలు లేరు.. పుట్టిన పిల్లలు లేరు.. ప్రొడ్యూసర్ల దగ్గర డబ్బులు తీసుకుంటావ్. వాళ్లకు డేట్లు ఇవ్వవు.. తలుపులు తీయవు. వాళ్లు నీకోసం పడిగాపులు కాయాలి. వాళ్లకు సమాధానం చెప్పవు. జూబ్లీహిల్స్‌లో నువ్వు ఎవరినైనా కలుస్తావా? ఎవరికైనా టైం ఇస్తావా..? నిన్ను నాయకుడి అంది ఎవరు..? నిన్ను రాజకీయాల్లోకి రమ్మంది ఎవరు..? రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలేవీ నీకు లేవు. విశాఖపట్నంలో ఒక అమ్మాయిని మోసం చేశావ్.. మోసంతో, వెన్నుపోటుతో నువ్వు విశాఖలో జీవితం మొదలుపెట్టావ్. నువ్వో మనిషివి, నీకు ఆదర్శాలా..? 2024లో నువ్వు ఎన్ని సీట్లు గెలుస్తావో.. ఎక్కడ పోటీ చేస్తావో చూద్దాం. వీధి రౌడీకి పవన్ కళ్యాణ్‌కు ఎక్కడైనా తేడా ఉందా? పవన్ కళ్యాణ్‌కు మనిషికి ఉండాల్సిన లక్షణాలేవీ లేవు’ అంటూ జనసేనానిపై విశాఖ ఎంపీ మాటలతో విరుచుకపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com