పవన్ కొండను తవ్వి వెంట్రుక కూడా పీకలేకపోయారని, ముఖ్యమంత్రి స్థానంలో జగన్‌ను చూడలేక ఇలా మాట్లాడుతున్నారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ఆరోపించారు. జగన్ మీద, తమ ప్రభుత్వం మీద మీకున్న ద్వేషం ఏమిటి..? అని ప్రశ్నించారు. మొన్న రుషికొండ వెళ్లి సాధించింది ఏమీ లేదని, అక్కడ ఫేస్ లెఫ్ట్ టర్న్ ఇచ్చి ఉండి ఉంటే పవన్‌కు గీతం ఆక్రమణలు కనిపించేవని విమర్శించారు. 'గీతంలో 43 ఎకరాలు కబ్జా చేశారు. అప్పుడు చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించలేదు..? జగన్‌ను చూసి పవన్ ఇన్స్పైర్ అవ్వాలి.. పవన్ తోటి హీరోలని చూసి ఈర్ష్య పడాలి.. నీలాంటి కథానాయకుడు వచ్చి ప్రజా నాయకుడిపై ఈర్ష్య పడటం విడ్డురంగా ఉంది. విస్సన్నపేట భూములకు సంబంధించి బాధితులు ఎవరైనా మీకు ఒక్క ఫిర్యాదైన చేసారా..? విస్సన్నపేట భూములకు చంద్రబాబు హయాంలో పరిహారం ఇచ్చారు. ప్రభుత్వ భూమి అయితే పరిహారం ఎందుకు ఇస్తారు..? ఒకవేళ ఆ పరిహారం ఇవ్వడమే తప్పుడు అయితే ఆ తప్పు పవన్ డాడీ చంద్రబాబుదే' అని అమర్‌నాథ్ ఆరోపించారు.
'పవన్.. మీ నాన్న కానిస్టేబుల్ కాక ముందు మా తాత ఎమ్మెల్యే.. చిరంజీవికి మంచి క్రేజ్ ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పి సినిమాల్లోకి పవన్ వచ్చారు. కానీ మా నాన్న చనిపోయాక నేను రాజకీయాల్లోకి వచ్చి కష్టపడ్డాను. పవన్ ఒక కీచక గురువు.. క్రమశిక్షణ లేనివారు జనసేనలో ఉన్నారు.. నమ్మి వెనక తిరుగుతున్న వారిని మూటకట్టి చంద్రబాబుకి అమ్మేస్తారు.. జనసేన నాయకులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవద్దు.. జనసేనకు పెట్టిన ఖర్చు దండగ.. బుద్ద వెంకన్న ఓ అనకొండ.. బుద్ద వెంకన్న ఏం చదువుతున్నాడు.. కాల్‌మనీలో మహిళలను వేధించినప్పుడు పవన్ ఏం చేస్తున్నాడు.. నోట్లో హెరిటెజ్ ఐస్‌క్రీమ్ పెట్టుకున్నావా..? బుద్ద వెంకన్న కొండలు మింగిన అనకొండ.. భూములకు, ఉపాధికి సంబంధం ఏంటి..?' అని అమర్‌నాథ్ ప్రశ్నించారు. పరుచూరి భాస్కరావును చూస్తే జాలి వేస్తుందని, అనకాపల్లిలో అనవసరమైన ఖర్చు చేస్తున్నారని అమర్‌నాథ్ విమర్శించారు. ఎక్కడికి వెళ్లినా పవన్ సాధించేది ఏమీ లేదని అమర్‌నాథ్ పేర్కొన్నారు.