కుప్పం నియోజకవర్గ మహిళా నేతలతో తెలుగుమహిళ జిల్లా అధ్యక్షురాలు కార్జాల అరుణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నా అందరికీ ఏడాదికి రూ.15వేలు, ప్రతి మహిళకూ నెలకు రూ.1500 అందిస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని వివరించారు. తెలుగు మహిళ జిల్లా ఉపాధ్యక్షురాలు సుగుణమ్మ, నియోజకవర్గ అధ్యక్షురాలు అనసూయ, ఉపాధ్యక్షురాలు రాణెమ్మ, రామకుప్పం మండల అధ్యక్షురాలు పద్మమ్మ, మాజీ ఎంపీటీసీ అలివేలుమంగమ్మ, నేతలు లోకమ్మ, భువనేశ్వరితదితరులు పాల్గొన్నారు.