పీఎం ఇ-బస్ సేవకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ సేవలకు గానూ కేంద్రం రూ.57 వేల కోట్ల మొబిలిటీ ఫండ్‌ను కేటాయించినట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో తెలిపారు. దీని ద్వారా దేశంలోని 100 నగరాలు, పట్టణాలకు 10 వేల ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ పథకం ద్వారా 45,000-55,000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు.