అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం... కొత్తవలస మండలం సరిహద్దు గ్రామమైన సంతపాలెం గ్రామ సమీపంలోని లైట్‌హౌస్ ఫ్యామిలీ దాబాలో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక శాఖ అధికారి సోమేశ్వరరావు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.1.80 లక్షల విలువైన ఆస్తినష్టం వాటిల్లిందన్నారు. వినియోగదారుల కోసం గడ్డితో వేసిన గుడిసెలు, ఫర్నీ చర్ కాలిపోయాయన్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa