శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. నరసన్నపేటలో అత్యధికంగా 63.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రణస్థలంలో 50.25, సోంపేటలో 43.0, సరబుజ్జిలిలో 42.5, ఎచ్చెర్లలో 42.25, శ్రీకాకుళంలో 34.5, లావేరులో 33.5, కోటబొమ్మాళిలో 32.5, బూర్జలో 30.0, ఆమదాలవలసలో 29.5, గారలో 22.0 వర్షపాతం నమోదైంది. కాగా శ్రీకాకుళం నగరంలో ఇటు కాంప్లెక్స్లోను.. అటు రోడ్లపై నీరు నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు.