విశాఖ జిల్లాలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ‘జనవాణి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో పాల్గొన్న ప్రజలు తమ కష్టాలని, సమస్యలని ఆయనకి చెప్పుకున్నారు. మరికొందరు సాయం చెయ్యాలంటూ పవన్‌కల్యాణ్ కాళ్లపై పడి వేడుకున్నారు. అన్నీ ప్రశాంతంగా విన్న ఆయన బాధితులకు అండగా ఉంటానని, వారి తరఫున ప్రభుత్వంతో పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.