కర్నూలు జిల్లా, పత్తికొండ సీపీఐ కార్యాలయంలో సీపీఐ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర విజయవంతాన్ని కోరుతూ పోస్టర్లను విడుదల చేశారు. రామచంద్రయ్య, సీపీఐ జిల్లా నాయకులు గిడ్డయ్య మాట్లాడుతూ.... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకమునుపు అనేక హామీలను ప్రజలకు ఇచ్చారనీ, గద్దెనెక్కాక ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. ఈ నెల 17న ప్రారంభమైన బస్సు జాతా సెప్టెంబరు 8న తిరుపతిలో ముగుస్తుందన్నారు. సెప్టెంబరు 2న పత్తి కొండకు బస్సు జాతా వస్తుందని, ఈ జాతాను ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించి స్వాగతించాలని పిలుపునిచ్చారు. సీపీఐ సీనియర్ నాయకులు భీమలింగప్ప, మండల కార్యదర్శి రాజాసాహేబ్, ప్రజాసంఘాల నాయ కులు నబీరసూల్, కారన్న, నెట్టికంటయ్య పాల్గొన్నారు.