తిరుమల తిరుపతి శేషాచల కొండల్లో చిరుతలు సంచరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ,అటవీ శాఖ సంయుక్తంగా ఆపరేషన్ చిరుత నిర్వహించారు. అలిపిరి నడకమార్గంలో చిరుతల సంచారం గుర్తించేందుకు 320 ట్రాప్ కెమెరాలకీ అదనంగా మరో 200 కెమెరాలను టీటీడీ ఏర్పాటు చేసింది. శ్రీవారి మెట్టు మార్గంలో 82 కెమెరాలని అటవీ అధికారులు ఏర్పాటు చేశారు. అలిపిరి కాలిబాట మార్గంలో ప్రస్తుతానికి జంతు సంచారం లేదని డీఎఫ్‌ఓ శ్రీనివాసులు పేర్కొన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో పలు జంతువుల సంచారాన్ని గుర్తించామన్నారు. ఈ ప్రాంతంలో జంతు సంచారంపై అధ్యయనం చెయ్యడానికి మరి కొంత సమయం పడుతుందన్నారు. కాలినడకన వచ్చే భక్తులు గుంపులుగా రావాలని సూచించారు.