ప్రభుత్వ ఉద్యోగులకి పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఏపీసీపీఎస్యూ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు గురుగుబెల్లి భాస్కరరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... పలు మీడియా పత్రికలలో జీపీఎస్‌పై వచ్చిన కథనం పచ్చి అబద్ధమని, దానిని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఇటువంటి గందరగోల పింఛన్ స్కీమ్‌ను ఆమెదించేది లేదని, పాద యాత్ర సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసారు. పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే కొనసాగించాలని డిమాండ్ చేశారు.