టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినిపై విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.... రజిని అవినీతి చిట్టాకు లెక్కే లేదని.. ఇంకా ఎంత దోచుకుంటారో తెలియదని అన్నారు. మంత్రి విడదల రజిని ఆరోగ్యశాఖను పూర్తిగా భ్రష్టుపట్టించారని విమర్శించారు. ఆస్పత్రుల్లో కనీసం మందులు కూడా అందుబాటులో ఉండట్లేదన్నారు. వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీ నుంచి బదిలీల వరకు అవినీతే జరుగుతోందని, భూవివాదం ఉన్నచోట తలదూర్చి సెటిల్ మెంట్లు చేస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది మొత్తం మంత్రి కుటుంబీకులేనని, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో రూ.50 లక్షల అవినీతి జరిగిందని ఆరోపించారు.