మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (70) అలియాస్ సాయన్న మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజిరెడ్డి నేడు తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మావోల కార్యకలాపాల విస్తరణలో రాజిరెడ్డి కీలక పాత్ర పోషించారు. రాజిరెడ్డి మృతిచెందినట్లు ఛత్తీస్ ఘడ్ పోలీస్ అధికారులు ధృవీకరించారు.