పని ప్రదేశానికి తరలించే సమయంలో ప్రమాదవశాత్తూ కాలికి గాయమైన భారతీయుడుకి పరిహారం విషయంలో సింగ్‌పూర్ కోర్టు అనుకూలంగా తీర్పుచెప్పింది. అతడికి 73,000 అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.61 లక్షలు) పరిహారం చెల్లించాలని సింగ్‌పూర్ సంస్థను ఆదేశించింది. వాహనంలో నుంచి దిగుతుండగా బాధితుడి జారిపడి అతడికి కాలికి గాయమైంది. తమిళనాడుకు చెందిన రామలింగం మురుగన్.. తనతో పాటు ఇతర కార్మికులను సైట్‌కు తరలించిన వాహనంలో నుంచి దిగడానికి సురక్షితమైన వ్యవస్థను అందించడంలో సంస్థ విఫలమైందని ఆరోపించారు. తనకు జరిగిన ప్రమాదానికి లక్ష సింగ్‌పూర్ డాలర్లను పరిహారంగా చెల్లించాలని స్థానిక కోర్టులో పిటిషన్ వేశాడు.
దీనిపై విచారణ చేపట్టిన డిస్ట్రిక్ట్ జడ్జ్ టాన్ మే తీ.. రామలింగం వాదనలను సమర్ధించారు. ట్రక్కు ఎక్కడానికి, దిగడానికి కూడా సురక్షితమైన వ్యవస్థ అవసరమని న్యాయమూర్తి అన్నారు. సింగ్‌పూర్‌లోని ‘రీగల్ మెరైన్ సర్వీసెస్’ అనే నౌక మరమ్మత్తుల కంపెనీలో పనిచేస్తున్న రామలింగం మురుగన్ (37).. 2021 జనవరి 3న ప్రమాదానికి గురయ్యాడు. ఆ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో మురుగన్ తన వసతి గృహం నుంచి 11ఏ జూ యీ రోడ్‌లోని కంపెనీకి 24 మంది కార్మికులతో కలిసి లారీలో వెళుతున్నారు.
వర్క్‌సైట్‌కు వచ్చేసరికి కార్మికులను దింపి..అక్కడ నుంచి మరో ట్రక్కుకు తరలించి, పని చేసే ప్రదేశానికి తీసుకెళ్లారు. ట్రక్కులో నుంచి దిగుతున్న సమయంలో భారీ వర్షం కురువడంతో హడావుడిగా దిగుతూ జారిపడ్డాడు. కార్మికులను దింపుతున్న సమయంలో వాహనం టెయిల్‌బోర్డ్ దింపకపోవడంతో దానిని పట్టుకోవడానికి రెండు చేతులను ఉపయోగించాడు. ఎడమ కాలిని టెయిల్‌బోర్డ్‌పై పెట్టి దింగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పైన ఉన్న మిగతా కార్మికులు నెట్టేయడంతో పట్టుతప్పి పడిపోయాడు. కిందపడిపోవడంతో కుడి మోకాలికి వాపు వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా, అతని కుడి కాలులో ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు.
శస్త్ర చికిత్స చేసిన వైద్యులు.. కొద్ది నెలల పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాదాపు ఐదు నెలల పాటు మెడికల్ లీవ్‌లో ఉన్న మురుగన్... తన కంపెనీపై దావా వేశారు. వారి నిర్లక్ష్యం కారణంగా తనకు ప్రమాదం జరిగిందని వాదిస్తూ.. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అతడి వాదనలను ఖండించిన సదరు సంస్థ.. ట్రక్కు నుంచి దిగుతుండగా జారిపడి పడిపోయాడని తెలిపింది. అతడి అజాగ్రత్త వల్లే ఇలా జరిగిందని కంపెనీ వాదించింది. అంతేకాదు, అతడి వైద్యం చేసి ఖర్చు, మెడికల్ లీవ్‌లో చెల్లించిన వేతనం తిరిగి చెల్లించాలని కోరింది. అయితే, సంస్థ వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి.. ప్రమాదవశాత్తూ తోసేయడం అనూహ్యమైనది కాదని వ్యాఖ్యానించారు. ‘వామనం టెయిల్‌బోర్డ్‌లోని మార్కింగ్ చూడగలిగినట్లుగా లేదు.. అంతేకాదు, లారీలో 20 కంటే ఎక్కువ మందిని తీసుకెళ్లడంతో రద్దీగా ఉన్నట్టు భావిస్తున్నాం’ అని న్యాయమూర్తి పేర్కొన్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa