శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. నవంబర్ మాసం టికెట్ల విడుదల షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించింది. ఇదిలా ఉండగా లక్కీ డిప్ విధానంలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోసం ఇవ్వాళ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకునే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం 10 గంటలకు ఊంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల కానున్నాయి.