చంద్రయాన్ -3 మరో ఘనత సాధించింది. యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రాంగా రికార్డుకెక్కింది. భారత ఇస్రో చంద్రయాన్-3 లైవ్‌ను ఏకంగా 8.06 మిలియన్లు మంది వీక్షించారని తాజా లెక్కల ద్వారా తెలుస్తోంది. కాగా జాబిల్లిపై భారతీయ జెండాను రెపరెపలాడించేందుకు ఉద్దేశించిన ఈ చంద్రయాన్-3 మిషన్ బడ్జెట్ కేవలం రూ.615 కోట్లే. దీంతో అతి తక్కువ బడ్జెట్‌తో అంతరిక్ష యాత్రల జాబితాలో ప్రత్యేకంగా నిలిచింది.