కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన క్రమంలో గతంలో ఆయన ఖాళీ చేసిన అధికారిక బంగ్లాను అధికారులు తిరిగి ఆయనకే కేటాయించారు. అయితే, ఆ ఇంటికి వెళ్లేందుకు రాహుల్ నిరాకరించినట్లు తెలుస్తోంది. తన పాత బంగ్లాకు వెళ్లబోనని వివరిస్తూ పార్లమెంటరీ హౌసింగ్ కమిటీకి ఆయన లేఖ రాసినట్లు పార్టీ వర్గాలు గురువారం వెల్లడించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa