చంద్రునిపై చంద్రయాన్-3 ల్యాండర్ ను విజయవంతంగా దింపి భారత్ జయకేతనం ఎగురవేసింది. అయితే, వీటి జీవిత కాలం లూనార్ డే (14 రోజులు) మాత్రమేనని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. జాబిల్లిపై 14 రోజులుండే పగటి సమయంలోనే సూర్యరశ్మి ఆధారంగా ఈ వ్యవస్థలు పనిచేస్తాయి. ఆ తర్వాత ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడితే మరో లూనార్ డే వరకూ పని చేసే అవకాశం ఉంది. అదే జరిగితే బోనస్ అనే చెప్పాలి.