రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి కుటుంబం నిరంతరం ఆనందంగా ఉండాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనుక్షణం పరితపిస్తున్నారని డిప్యూటీ సీఎం, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. నవరత్నాలు – ద్వైవార్షిక మంజూరు కార్యక్రమం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...... ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి కుటుంబం నిరంతరం ఆనందంగా ఉండాలని సీఎం అనుక్షణం పరితపిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి పేదవాడు కూడా ఆనందంగా ఉండాలని ఆలోచన చేయడం, ఆ ఆలోచనను అమలు చేయడం, ఎక్కడా రూపాయి లంచం లేకుండా శాచురేషన్ మోడ్‌లో పథకాలు అందిస్తున్నారు. మేం గడప గడపకు కార్యక్రమంలో వెళ్ళినప్పుడు ఏ కారణం చేతనైనా ఎవరికైనా లబ్ధి రాకపోయినా ఆ కుటుంబం కూడా మాకు జగనన్న చేస్తారు అనే నమ్మకం, ధైర్యంతో మాకు చెబుతున్నారు. అవ్వాతాతలు మా మనవడు మాకు చేస్తున్నారు అనడం, చిన్నారులు కూడా మా జగన్ మామ ఇస్తున్నారనడం, మేం చక్కగా చదువుకుంటున్నామంటే మా జగన్ మామే కారణం అంటున్నారు. గతంలో ఒకరికి వస్తే నలుగురికి వచ్చేవి కావు, కానీ ఇప్పుడు శాచురేషన్ మోడ్‌లో ప్రతి ఒక్కరికీ, ప్రతి కుటుంబానికి ఇస్తున్నారు. ఈ రాష్ట్రానికి జగన్ గారు మళ్ళీ సీఎం అయితేనే మేం ఆనందంగా ఉంటామని ప్రజలు అంటున్నారు అని తెలియజేసారు.