అర్హులై ఉండి కూడా సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందని వారు ఆయా పథకాలను అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. వెరిఫికేషన్ అనంతరం.. మిగిలిపోయిన అర్హులకు కూడా ఆర్నెళ్లకు ఒకసారి ప్రభుత్వం ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సోషల్ ఆడిట్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తోంది. లంచాలు, వివక్షకు తావులేకుండా అర్హులందరికీ నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. అర్హత ఉండి , రాని వారు ఎవరైనా ఉంటె మరలా అప్లై చేసుకోండి అని ప్రభుత్వ అధికారులు తెలియజేస్తున్నారు.