నిడదవోలు ప్రభుత్వాసుపత్రుల్లో గర్భిణులకు పరీక్షలు, ప్రసూతి సేవలు మెరుగైన రీతిలో అందాలని జిల్లా సహాయ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిడదవోలులో ప్రసూతి సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి(డీసీహెచ్‌ఎస్) డాక్టర్ కె.సనత్‌కుమారి మాట్లాడుతూ..... ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికార్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు ప్రసూతి సేవల పెంపుపై దృష్టి సారించాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా సేవలందించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఏవీఆర్‌ఎస్ తాతారావు, డాక్టర్ చైతన్య తదితర్లు పాల్గొన్నారు.