బైక్ అదుపు తప్పి ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒడిషా రాష్ట్రానికి చెందిన కనహైదాస్ (35) అనే కార్మికుడు శుక్రవారం మధ్యాహ్నం 2: 30 గంటల సమయంలో నాదెండ్ల మండలం రోడ్డులో తన ద్విచక్రవాహనాన్ని అతివేగంగా నడుపుతూ సడన్ బ్రేక్ వేయటంతో వాహనం అదుపుతప్పి ప్రహరీని ఢీకొన్నాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa