కేరళలో ఎక్సైజ్ శాఖ తన ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను పటిష్టం చేసింది. రూ. 2.5 కోట్ల విలువైన డ్రగ్స్, వేల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 8న ప్రారంభమైన ప్రత్యేక ఓనమ్ డ్రైవ్‌లో ఆగస్టు 24 వరకు డ్రగ్స్, కల్తీ మద్యంపై 7,000 కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతే కాకుండా వందలాది మంది నిందితులను, పదార్థాలను రవాణా చేసేందుకు ఉపయోగించిన వాహనాలను కూడా అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపారు.సెప్టెంబరు 5 వరకు కొనసాగనున్న స్పెషల్ డ్రైవ్‌లో కేరళ అంతటా ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.ఆపరేషన్‌లో భాగంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని, పొరుగు రాష్ట్రాల నుంచి సరిహద్దు దాటి డ్రగ్స్ అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని ఆ ప్రకటనలో తెలిపారు.