మంత్రాలయం మండలంలో చెట్నహళ్ళి కేంద్రంగా జోరుగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతోంది. రాత్రి సమయాల్లో ఎక్కువగా ఈ తంతు సాగుతోంది. గ్రామంలోని పలుచోట్లు అక్రమంగా ఇసుకను డంపుచేసి అక్రమార్కులు అధిక ధరకు ఇసుకను విక్రయిస్తున్న సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామంలో సుమారు నాలుగు , ఐదు స్థలాల్లో ఈ అక్రమ ఇసుకను డంపు చేశారు. చెట్నహళ్ళే కాకుండా మంత్రాలయం , మాధవరం గ్రామాల్లో సైతం ఈ ఇసుక డంపులు పదులసంఖ్యలో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa