రాఖీ పౌర్ణమి రోజు అన్న, తమ్ముళ్లకు రాఖీలు కట్టి.. వారి నుంచి బహుమతులు పొందడం ఆనవాయితీ. అయితే ఓ అక్క మాత్రం.. తమ్ముడికి రాఖీ కట్టి, విలువ కట్టలేని బహుమతిని అందించేందుకు సిద్దమైంది. గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న తన తమ్ముడికి కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో మరికొన్ని రోజుల్లో ఆపరేషన్ నిర్వహించి.. అక్క కిడ్నీని తీసి.. తమ్ముడికి అమర్చనున్నారు. దీంతో ఆపరేషన్‌కు ముందే తమ్ముడికి రాఖీ కట్టి.. ఆ చెల్లి ఆపరేషన్‌కు సిద్ధమైంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన 48 ఏళ్ల ఓం ప్రకాశ్ ధంగర్.. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నాడు. ఓం ప్రకాశ్ ధంగర్ ఒక కిడ్నీ 80 శాతం పాడైంది. మరో కిడ్నీ 90 శాతం పనిచేయకుండా పోయింది. ఈ క్రమంలోననే అతనికి కిడ్నీ మార్చాలంటూ వైద్యులు సూచించారు. ఈ క్రమంలోని ఓం ప్రకాశ్ ధంగర్ అక్క షీలాబాయ్ పాల్ కిడ్నీ.. అతని కిడ్నీతో సరిపోలింది. దీంతో తమ్ముడు ఓం ప్రకాశ్ ధంగర్‌కు కిడ్నీ ఇచ్చేందుకు షీలాబాయ్ పాల్ ముందుకు వచ్చింది. వచ్చే నెల 3 వ తేదీన వీరికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీని వైద్యులు నిర్వహించనున్నారు. గుజరాత్‌లోని నడియాడ్‌లోని ఓ ఆస్పత్రిలో ఈ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీని చేయనున్నారు.
ఓం ప్రకాశ్ ధంగర్ గతేడాది మే నెల నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధులతో తీవ్ర అవస్థ పడుతున్నారు. ఈ క్రమంలోనే రెగ్యూలర్‌గా డయాలసిస్ కూడా చేసుకుంటున్నారు. అయినప్పటికీ రెండు కిడ్నీలు దాదాపుగా పూర్తిగా చెడిపోవడంతో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని డాక్టర్లు సూచించారు. ఇందులో భాగంగానే ఓం ప్రకాశ్ ధంగర్‌కు సరిపోయే కిడ్నీ దాతల కోసం వెతికారు. అయితే ఆయన అక్క షీలాబాయ్ పాల్ కిడ్నీ సరిగ్గా సరిపోతుందని డాక్టర్లు గుర్తించారు. ఈ విషయం తెలియగానే షీలాబాయ్ పాల్.. తన కిడ్నీని తమ్ముడికి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆమె రాయ్‌పూర్‌లోని టిక్రాపారా ప్రాంతంలో నివసిస్తుంది. ఆమెకు అన్ని రకాల టెస్టులు నిర్వహించిన తర్వాత షీలాబాయ్ పాల్ కిడ్నీ.. ఓం ప్రకాశ్ ధంగర్‌కు కరెక్టుగా సరిపోతుందని డాక్టర్లు చెప్పారు.
దీంతో వారు ఈ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ కోసం ఇప్పటికే గుజరాత్‌లోని నడియాడ్‌లో ఉన్న ఆస్పత్రికి చేరుకున్నారు. సెప్టెంబరు 3 వ తేదీన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ ఉన్న నేపథ్యంలో రాఖీ పండగ సందర్భంగా తమ్ముడు ఓం ప్రకాశ్ ధంగర్‌కు అక్క షీలాబాయ్ పాల్ రాఖీ కట్టింది. తన తమ్ముడు ఆరోగ్యంగా కలకాలం జీవించాలని వేడుకుంది. తన తమ్ముడి కోసమే తాను ఈ కిడ్నీ దానం చేస్తున్నానని.. తనకు తన తమ్ముడు అంటే చాలా ఇష్టమని.. అతడు ఆరోగ్యంగా ఇంకా చాలా సంవత్సరాలు బతకాలని ఆకాంక్షించింది.