విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. షరతులతో కూడిన ఆందోళనలు నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. ఈ నెల 10న ధర్నా చేసుకోవాలని ఉద్యోగుల సంఘానికి ధర్మాసనం సూచించింది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల లోపు జరుపుకోవాలని ఆదేశించింది. తమ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ధర్నాకు అనుమతి కావాలని కోరుతూ విద్యుత్ సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి. విచారణ జరిపిన న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa