శుక్రవారం కైకలూరు నుంచి ఆకివీడు వైపు చేపల లోడు లారీ వేగంగా వెళ్తోంది. మార్గమధ్యంలో కైకలూరు మండలం ఆలపాడు ఆదర్శ స్కూల్ వద్ద పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి విస్తరణ పనులు నిర్వహిస్తున్న ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో లారీలో పదిమంది చేపల ప్యాకింగ్ కూలీలు ఉన్నారు. వారికి స్వల్ప గాయాలు కావడంతో ఆకివీడులోని ప్రైవేటు ఆసుపత్రికి స్థానికులు తరలించారు. దీనిపై కేసు నమోదు కాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa