అనంతపురం, నంబులపూలకుంట మండలంలో బలిజపల్లిలో కుక్కల దాడిలో 14 గొర్రెలు మృతిచెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే..... బలిజపల్లి గ్రామంలో హరి తన గొర్రెలను సమీపంలోని దొడ్డిలోకి ఉదయమే తరలించారు. అనంతరం ఆయన సమీపంలోని ఇంటికి వెళ్లాడు. దీంతో 8 కుక్కలు దొడ్డిలోకి దూరి దొరికిన గొర్రెను దొరికినట్లే గాయపరిచాయి. గొర్రెల అరుపులు విని.. హరి అక్కడికి చేరుకోగా.. అప్పటికే 14 గొర్రెలు మృతిచెందాయి. ఈదాడిలో రూ.లక్ష 50 వేలు నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని హరి వేడుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa