ఈనెల 12వ తేదీ నుంచి రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో పీజీ అడ్మిషన్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పీజీ సెట్‌కు హాజరైన విద్యార్థులు వెబ్‌సైట్‌లో కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. కౌన్సెలింగ్‌కు హాజరవుతున్న ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500 ఈనెల 12 నుంచి 20వ తేదీలోగా ప్రాసెసింగ్ ఫీజు ఆన్‌లైన్ చెల్లించి.. ఈ నెల 13 నుంచి 22వ తేదీలోగా సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయాలి. ఈ నెల 20 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. ఈ నెల 25న వెబ్ ఆప్షన్లలో చేర్పులు, మార్పులు చేసుకోవాలి. ఈ నెల 27వ తేదీన సాయంత్రం సీట్ల కేటాయింపు వివరాలను సెట్ కన్వీనర్ ప్రకటిస్తారు. ఈ నెల 29 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఇదే కౌన్సెలింగ్ ప్రక్రియతోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలోని పీజీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు.