పశ్చిమబెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు సరికాదని అన్నారు. అలానే యూపీ మాజీ సీఎం, ఎస్పీ (సమాజ్ వాది పార్టీ) అధినేత అఖిలేష్ యాదవ్... చంద్రబాబు అరెస్ట్‌పై ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ట్రెండ్‌గా మారిందన్నారు. అధికారంలోకి రాని వారిని జైల్లో పెట్టడం నిరంకుశ పాలకుల విధానమని.. ప్రజాస్వామ్యంలో దీనికి తావు లేదని తెలిపారు. రాజకీయాల్లో ఇలాంటి విషయాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బీజేపీ, వారి అవకాశవాద స్నేహితులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
![]() |
![]() |