ఈనెల 18 నుంచి జరిగే వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు నిబంధనలు పాటించాలని శ్రీకాకుళం ఎస్పీ జీఆర్ రాధిక కోరారు. డీఎస్పీ కార్యాలయంలో అనుమతులకు దరఖాస్తు పెట్టేముందు దరఖాస్తుతోపాటు మునిసిపాలిటీ లేదా పంచాయతీ, అగ్నిమాపక, విద్యుత్ అధికారులు ఇచ్చిన అనుమతులు తప్పనిసరిగా జతచేయాలని పేర్కొన్నారు. బలవంతపు చందాలు, వసూళ్లు, దర్శనాల టికెట్లు పెట్టరాదని తెలిపారు. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే డయల్ 100, లేదా 6309990933 పోలీసు వాట్సప్ నెంబరుకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఉదయం ఆరు నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలని సూచించారు. మండపం వద్ద సీసీ కెమెరాలు, రాత్రి పూట కాపలాగా ఒకరు ఉండాలని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఊరేగింపు సమయంలో అశ్లీలపాటలు ,డాన్సులు చేసినా, మందుగుండు సామగ్రి, టపాసులు వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.