న్యాయాధికారులు తప్పు తీర్పుఇస్తే దానిని ప్రశ్నించకూడదని ఏ రాజ్యాంగంలోనూ లేదు. ఇటువంటి పరిస్థితులలో న్యాయవ్యవస్థపై మాట్లాడకపోతే ఎలా? తీర్పు ఇచ్చిన జడ్జికి అకస్మాత్తుగా 4+4 గన్‌మెన్ల బందోబస్తు ఎందుకు ఇచ్చారో తెలియాలి అని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జడ్జి కాల్ డేటాను బయట పెట్టాలని కోరారు. జడ్జిని ఎవరైనా బెదిరించారా, ఒత్తిళ్లు తెచ్చారా అని అనుమానాలున్నాయి. ఈ కేసులో ముగ్గురు జడ్జిల పాత్రపై విచారణ జరిపించాలి. నాకు ఎటువంటి శిక్ష విధించిన ఫరవాలేదు. కానీ ప్రజలకు నిజం తెలియాలని డిమాండ్ చేశారు.