జీ20 సమావేశాల్లో పలు అంశాలపై సంతృప్తికర చర్చలు జరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ మీడియా సమావేశంలో శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రిప్టో కరెన్సీపై ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏకపక్ష నిర్ణయాలతో ఎటువంటి లాభం ఉండదన్నారు.అదే విధంగా ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి పలు సంస్థల్లో సంస్కరణలు అవసరమన్నారు.