మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వేదికగా అక్టోబర్ నెలలో నిర్వహించ తలపెట్టిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ వాయిదా పడింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్ నాథ్ శనివారం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు భోపాల్లో బహిరంగ సభ నిర్వహించాలని ఇండియా కూటమి ఇటీవలే నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.