ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు వద్ద ఒంగోలు-కత్తిపూడి జాతీయ రహదారిపై ఆగివున్న లారీని బైకు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులు నాగులుప్పలపాడు మండలం పైడిపాడు వాసులుగా గుర్తించారు. వినాయక విగ్రహం కొనుగోలు కోసం ఒంగోలు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa