భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కెనడాలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో భారత ఏజెంట్లకు సంబంధం ఉందని ఆరోపించారు. ఈ విషయంపై సహకరించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఖలిస్తానీ ఉద్యమం, భారత వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్న కెనడా పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను జూన్ 18న వాంకోవర్‌లోని సర్రేలో గుర్తు తెలియని వ్యక్తుల కాల్చి చంపిన విషయం తెలిసిందే.