కృష్ణానదిని పరిశుభ్రంగా ఉంచడంలో విజయవాడ నగర ప్రజలు భాగస్వాములు కావాలని మేయర్ రాయన భాగ్యలక్ష్మీ అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్యర్యంలో చేపట్టిన మిషన్ క్లీన్ కృష్ణా రివర్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, దేవినేని అవినాష్ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.... కృష్ణానదిలో చెత్త వేయడం ద్వారా నది కలుషితం అవుతుందని, నదిని కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. కృష్ణానదితో పాటు నగరంలో ఉన్న బందరు కాల్వ, ఏలూరు కాల్వ, రైవస్ కాల్వలతో పాటు మిగిలిన కాల్వలను కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.