పొగాకు ఉత్పత్తులకు యువత బానిసలుగా మారుతున్న క్రమంలో కర్ణాటక ప్రభుత్వం నియంత్రణకు సిద్ధమవుతోంది. అక్కడ త్వరలో హుక్కా బార్లాను నిషేధించాలని, పొగాకు ఉత్పత్తుల కొనుగోలు వయసును 21 ఏళ్లకు పెంచాలని యోచిస్తోంది. స్కూల్స్, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, మసీదులు, శిశు సంరక్షణా కేంద్రాలు, ఆస్పత్రుల చుట్టుపక్కల పొగాకు విక్రయం, వాడకం నిషేధించాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు.