ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళుతున్న సమయంలో మందడంలోని దీక్షా శిబిరం వద్ద అమరావతి రైతులు నిరసన తెలిపారు. జెండాలు పట్టుకుని సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.