చంద్రబాబు అవినీతిపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై సరైన ఫార్మాట్లో రాకుండా టీడీపీ నేతలు గందరగోళం సృష్టించారు. ఈరోజైనా సరైన ఫార్మాట్లో చర్చకు రావాలని కోరుతున్నాం. చిత్తశుద్ధి ఉంటే రండి చర్చిద్దాం. మీ వాదనలను మీరు వినిపించండి.. మా వాదనలు మేం వినిపిస్తాం. చంద్రబాబు అవినీతి చేయలేదని మీకు నమ్మకం ఉంటే.. చంద్రబాబు తప్పు చేయలేదని మీరు నిజంగా నమ్మితే చర్చలో పాల్గొనండి,అంతేకాని సభలో గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం చెయ్యకండి అని టీడీపీ నేతలకి తెలియజేసారు.