టీడీపీ అధినేత చంద్రబాబుకి ప్రాణహాని ఉంది అని నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన తరుణంలో, చంద్రబాబుకు ప్రమాదం పొంచి ఉంటే అది టీడీపీ వల్లే తప్ప మరే ఇతర వ్యక్తి వల్ల అసలుండదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యులు నందిగం సురేష్ జవాబిచ్చారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని, అవినీతి చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడని చెప్పారు. స్కిల్ స్కామ్లో లోకేష్ కూడా వాటాదారుడని, ఆయన్ను కూడా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో ఎంపీ నందిగం సురేష్ మీడియాతో మాట్లాడారు. లోకేష్ తప్పు చేశాడు కాబట్టే భయపడి ఢిల్లీకి వచ్చాడన్నారు. ఏ తప్పు చేయకపోతే సాయంత్రం ఫ్లైట్లో ఏపీకి వెళ్లొచ్చు కదా.. అని నిలదీశారు. దాక్కోవడానికి ఢిల్లీకి వచ్చి తండ్రిని రక్షించడానికి అంటూ లోకేష్ డ్రామాలు ఆడుతున్నాడన్నారు.