ఏపీలో ఆటో , ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 29న అకౌంట్‌లలో డబ్బులు జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 29న కాకినాడలో వైఎస్సార్ వాహనమిత్ర (Ysr Vahana Mitra Scheme) ఐదో విడత ఆర్థిక సాయం విడుదల రాష్ట్రస్థాయి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారని కలెక్టర్ కృతికా శుక్లా చెప్పారు. జిల్లా ఎస్పీ ఎస్.సతీశ్‌కుమార్, నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్ నాగ నరసింహారావు తదితరులతో కలిసి సభావేదిక, హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బహిరంగ సభ నిర్వహణకు జిల్లా పోలీసు కవాతు మైదానం, రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానం, జిల్లా క్రీడా మైదానాలను సందర్శించి అధికారులతో చర్చించారు. సమయం తక్కువగా ఉన్నందున యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డ్వాక్రా సంఘాలు, ట్యాక్సీ, ఆటో యూనియన్ల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా రాష్ట్రంలో ఆటో , ట్యాక్సీ, మాక్సి క్యాబ్ నడిపే వాహనదారులకు రూ.10వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఈ పథకాన్ని 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. వాహన మిత్ర పథకానికి లబ్ధిదారుడు సొంతంగా ఆటో రిక్షా లేదా టాక్సీ లేదా టాక్సీ క్యాబ్ కలిగి ఉండాలి.. సరైన డ్రైవింగ్ లైసెన్స్ కచ్చితంగా ఉండాల్సిందే. అర్హులైన లబ్ధిదారుడు నడుపుతున్న వాహనానికి సరైన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ RC పొంది ఉండాలి. ప్రతి ఒక్క దరఖాస్తు దారునికి సరైన ఆధార్ కార్డ్.. లబ్ధిదారుడు బీపీఎల్, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఒక కుటుంబానికి ఒక వాహనానికి మాత్రమే అమౌంట్ జమ చేస్తారు. ఇన్‌కమ్ సర్టిఫికెట్ కూడా కావాలి.
కుటుంబంలో భర్త, భార్య, మైనర్ పిల్లలను ఒక కుటుంబంగా పరిగణిస్తారు. వాహనం యొక్క ఓనర్ షిప్, లైసెన్స్ రైస్ కార్డు లో ఉన్నటువంటి ఎవరి పేరు మీద అయినా ఉండవచ్చు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన వాహనాలు కలిగిన వారు వెంటనే తమ అడ్రస్ మార్చుకోవాలి. అప్లై చేసే వ్యక్తి పేరు మీద వాహనం.. సరైన బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో స్థిర నివాసం.. 18 ఏళ్లకు పైన వయసు వారే అర్హులు. ఈ వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునేవారు వాలంటీర్స్ ద్వారా అప్లికేషన్ తీసుకొని సచివాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.. ఆ విధంగా స్వీకరించిన అప్లికేషన్స్ ఆరు దశల్లో ధ్రువీకరణ పాస్ అయితే అర్హులైన వారికి ప్రభుత్వం రూ.10వేలు జమ చేస్తుంది. అలాగే ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.