టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలతో కలిసి మాజీ మంత్రి పరిటాల సునీత లేఖ రాశారు. ‘సీఎం జగన్ మీపై కక్షగట్టి తప్పుడు కేసులు బనాయించారు. అరెస్టు చేసి మిమ్మల్ని జైలుకు పంపడం మమ్మల్ని ఎంతగానో బాధించింది. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం, భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించారు. అలాంటి మీకు ఈ పరిస్థితి రావడం బాధాకరం’. ‘మీరు మాకు దైవం. మా భవిష్యత్తు మీరే. మీరు ఆరోగ్యంగా, కడిగిన ముత్యంలా విడుదల కావాలి’ అని లేఖల్లో ఆకాంక్షించారు. కన్నీటితో ఈ లేఖలు రాస్తున్నామని పరిటాల సునీత ఆవేదనగా అన్నారు.