కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన'తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. దీనికి ఏడాదికి రూ.20 చెల్లించాలి. ఏటా రెన్యువల్ చేసుకోవాలి. 18-70 ఏళ్ల వయసు కలిగి, బ్యాంకు ఖాతా ఉంటే చాలు. ప్రమాదంలో పాలసీదారుడు చనిపోతే నామినీకి రూ.2 లక్షల బీమా అందుతుంది. శాశ్వత అంగవైకల్యానికి రూ.2లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.లక్ష బీమా పరిహారం అందుతుంది. ఖాతా ఉన్న బ్యాంకును సంప్రదిస్తే సరిపోతుంది.