విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ను మేల్కొల్పి తిరిగి వాటితో సంకేతాలు పునరుద్ధరణకు ఇస్రో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నెల 22న చంద్రుని సూర్యోదయం కావడంతో వాటిని తిరిగి యాక్టివేట్ చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. 2019లో చైనాకు చెందిన ల్యాండర్ చాంగ్-4, రోవర్ యుటు-2లను మేల్కొలిపినట్లు నిపుణులు చెబుతున్నా దక్షిణ ధ్రువంపై -250 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత క్రమంలో మేల్కొలుపుపై ఆశలు తక్కువగా ఉన్నాయంటున్నారు.