బెంగాల్ మల్దా జిల్లాలోని ముర్సెలీమ్ అనే పదేళ్ల బాలుడు సమయ స్ఫూర్తితో వందలాది మంది ప్రాణాలు కాపాడాడు. శుక్రవారం మధ్యాహ్నం ముర్సెలీమ్ చేపలు పట్టేందుకు వెళ్లగా, స్థానిక ఉన్న రైలు పట్టాల కింద భారీ గుంత గమనించాడు. ఆ టైంలో పట్టాలపై వస్తోన్న కాంచన్ జుంగా ఎక్స్ ప్రెస్ కు ఎదురెళ్లి తన రెడ్ షర్ట్ విప్పి సిగ్నల్ ఇచ్చాడు. రైలు నిలిపేసిన లోకో పైలెట్ గుంత చూసి బాలుణ్ని అభినందించాడు. రైల్వే శాఖ బాలున్ని ప్రశంసించింది.