స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు.. శనివారం విచారణలో కీలక ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. 'నైపుణ్యాభివృద్ధి సంస్థను ఎందుకు ఏర్పాటుచేశారు? కొన్ని నిర్ణయాలు పేరుకే మంత్రివర్గ నిర్ణయాలు తప్ప.. అవన్నీ మీ సొంత నిర్ణయాల్లానే కనిపిస్తున్నాయి? నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆడిటర్‌గా వెంకటేశ్వర్లును నియమించాలని మీరే ఆదేశించారట కదా?' అని ప్రశ్నించినట్లు సమాచారం.