ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి, పడమటి గాలుల ప్రభావంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ నెల 27 వరకు వానలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అంతేకాదు ఉత్తర అండమాన్ సముద్రంలో ఈ నెల 29న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. ఈ ప్రభావంతో ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చన్నారు. అనంతరం అది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలపడి, తీవ్రతరమవుతుంది అంటున్నారు.
ఇవాళ అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, పల్నాడు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, విజయనగరం, యానాం, అన్నమయ్య, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లా, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఆదివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిశాయి.
మరోవైపు రాయలసీమలోని జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. కడపలో 86.4 మిల్లీ మీటర్లు, కడప జిల్లా వల్లూరులో 80.4, శ్రీ సత్యసాయి జిల్లా నంబులిపులికుంటలో 76.2, శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో 68, శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడలో 67.2,చిత్తూరు జిల్లా నగరిలో 63.2, కడప జిల్లా వేంపల్లెలో 50.6, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో 45.4, చిత్తూరు జిల్లా శాంతిపురంలో 42.2, కడప జిల్లా కోడూరులో 39.6, శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో 38.2, చిత్తూరు జిల్లా పుంగనూరులో 38, శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరులో 37.4, అన్నమయ్య జిల్లా సాంబేపల్లిలో 37.2, శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లులో 36.4, నంద్యాల జిల్లా ఆత్మకూరులో 36.2, అనంతపురం జిల్లా శింగనమలలో 34.6, చిత్తూరు జిల్లా పలమనేరులో 33.2, కడప జిల్లా కమలాపురంలో 32.8, అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో 32.4, అన్నమయ్య జిల్లా చిన్నమండెంలో 32, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 30, కపడ జిల్ల దువ్వూరులో 30 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా భారీ వానలు పడ్డాయి. విజయనగరం జిల్లా గరివిడిలో 68.2 మిల్లీ మీటర్లు, విజయనగరంలో 61.6, అనకాపల్లిలో 60.8, బాపట్ల జిల్లా అద్దంకిలో 58.4, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 56.4, ప్రకాశం జిల్లా కంభంలో 54, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 48.6, విజయనగరం జిల్లా బొందేపల్లిలో 47.2, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 40, బాపట్ల జిల్లా సంతమాగులూరులో 36.2, ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో 34.2, ఎన్టీఆర్ జిల్లా విజయవడలో 34.1, విజయనగరం జిల్లా గజపతినగరంలో 33.6, ప్రకాశం జిల్లా ఒంగోలులో 30, పార్వతీపురంలో 30 మిల్లీ మీటర్ల వాన పడింది.