ఇండియాలో రూ.2 వేల కంటే హై డినామినేషన్ విలువ గల నోట్లు చెలామణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్బీఐ ప్రకారం 1938లో రూ.10,000 నోట్‌ను ప్రింట్ చేశారు. ఇండియా ప్రింట్ చేసిన అత్యధిక విలువగల నోట్ ఇదే. అయితే ఆ నోట్‌ను 1946లో రద్దు చేశారు. కానీ మళ్లీ 1954లో రూ.10,000 నోటును ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఇక చివరకు 1978లో ఆ రూ.10,000 నోట్‌ను డిమానిటైజ్ చేశారు. అలాగే రూ.5 వేల నోట్ కూడా గతంలో ఉండేది.