ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని కొలబీమునిపాడు మరియు చింతకుంట గ్రామాల్లో ఏ. ఓ దేవిరెడ్డి శ్రీనివాసులు సోమవారం క్షేత్రస్థాయి పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రతీ రైతు తాము వేసిన ప్రతీ పంటను ఆర్. బీ. కె లోని వ్యవసాయ సిబ్బందిని సంప్రదించి పంట నమోదు చేపించుకోవాలని తెలియజేసారు. ఈ-పంట నమోదుకు ఈ నెల సెప్టెంబర్ 30వ తారీకు తుది గడువు గా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa